పోలీసులకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన పోచమ్మ తల్లి విగ్రహం!
- మంచిర్యాల జిల్లా భీమారంలో ఘటన
- కొత్త స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయింపు
- అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గుర్తు తెలియని వ్యక్తులు
ఇటీవల జైపూర్ ఏసీపీ సీతారాములు కోరిక మేరకు, భీమారం వచ్చిన మంచిర్యాల ఆర్డీవో, ప్రస్తుతం పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్నే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు పోచమ్మ విగ్రహాన్ని తెచ్చి పెట్టి, చుట్టూ కాషాయం జెండాలు పాతి, దాన్ని ఓ గుడిగా మార్చేశారు. ప్రజలు పెద్దఎత్తున వచ్చి పూజలు ప్రారంభించడంతో, మరోసారి పోలీసు స్టేషన్ భవనం నిర్మాణంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ స్థలంపై కన్నేసిన కొందరు కావాలనే పోచమ్మ విగ్రహం తెచ్చి పెట్టినట్టు తెలుస్తోంది.