ఈ సారి అఖిల్ మూవీలో చేసేది కొత్త హీరోయిన్ కాదట!
- వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ
- అఖిల్ కి కలిసిరాని కొత్త హీరోయిన్లు
- క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్స్ పై దృష్టి
అఖిల్ మొదటి సినిమా ద్వారా తెలుగు తెరకి సాయేషా సైగల్ పరిచయమైంది. రెండవ సినిమా ద్వారా కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. అయితే ఈ రెండు సినిమాలకి కూడా కథానాయికలు ప్లస్ కాలేకపోయారు. అందువలన ఈ సారి కొత్త కథానాయికల జోలికి వెళ్లకుండా, ఆల్రెడీ యూత్ లో మంచి క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్ ను తీసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో వెంకీ అట్లూరి వున్నాడట. అదే విషయాన్ని ఆయన నాగార్జునతోను చెప్పాడని అంటున్నారు. ఇక ఈ సారి అఖిల్ జోడీగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.