'ఎనర్జిటిక్ స్టార్' రామ్ తదుపరి చిత్రం 'గరుడవేగ' దర్శకుడితో!
- యాక్షన్ మూవీగా రామ్ తదుపరి చిత్రం
- ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో
- మంచుకొండల్లో రామ్‌తో పోరాటాలకు దర్శకుడి ప్లాన్..!
రామ్‌లోని ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని దట్టమైన మంచుతో కప్పబడిన పర్వతశ్రేణుల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలకు దర్శకుడు ప్రవీణ్ ప్లాన్ చేసినట్లు ఫిలింవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం అందమైన లొకేషన్లను ఎంపిక చేయడానికి ప్రవీణ్ తన ప్రొడక్షన్ టీమ్‌తో పాటు గతవారం యూరప్ వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగొచ్చిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్, సంగీత దర్శకుడు తదితర ముఖ్యమైన వివరాలు తెలిసే అవకాశముంది. రామ్ ప్రస్తుతం దిల్ రాజు సంస్థలో 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అతని కెరీర్లో 16వ చిత్రం.