ఎన్టీఆర్ ను రావద్దని నేనే చెప్పా: కల్యాణ్ రామ్
- 'ఎమ్మెల్యే' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు తారక్ వస్తాడంటూ ప్రచారం
- త్రివిక్రమ్ సినిమా కోసం బాడీ లుక్ ఛేంజ్ చేసుకున్న తారక్
- లుక్ అవుట్ కాకూడనే ఉద్దేశంతో ఫంక్షన్ కు రాని ఎన్టీఆర్
ఈవెంట్ కు ముందు తామిద్దరం మాట్లాడుకున్నామని కల్యాణ్ రామ్ చెప్పాడు. ఫంక్షన్ కు రావాలని తారక్ భావించినప్పటికీ, లుక్ అవుట్ అవుతుందేమో అని ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. దీంతో, తానే కల్పించుకుని, ఫీల్ అవద్దని చెప్పానని అన్నాడు. తామిద్దరం ప్రొఫెషన్ ను చాలా సీరియస్ గా తీసుకుంటామని తెలిపాడు. తారక్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకూడదని భావించానని... అతని కష్టాన్ని తాను తీసేసుకోకూడదని అనుకున్నానని చెప్పాడు.