దెయ్యం పాత్రలో భయపెట్టనున్న భూమిక
- నాజూకుదనంతో మార్కులు కొట్టేసిన భూమిక
- తాజాగా 'యూ టర్న్' రీమేక్ కి ఓకే
- తొలిసారిగా భయపెట్టే పాత్రలో
కన్నడలో హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయిన 'యూ టర్న్' సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో భూమిక పాత్ర కూడా ప్రాధాన్యత కలిగిందిగా కనిపిస్తుందట. కన్నడలో రాధికా చేతన్ పోషించిన దెయ్యం పాత్రలో భూమిక కనిపించనుందని అంటున్నారు. ఇప్పటివరకూ నాజూకుదనంతోనే ఆకట్టుకున్న భూమిక, ఈ థ్రిల్లర్ మూవీలో దెయ్యం పాత్రను చేయడానికి అంగీకరించడం విశేషమేనని చెప్పాలి.