'ఆచారి అమెరికా యాత్ర' కొత్త రిలీజ్ డేట్
- మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
- కీలకమైన పాత్రలో బ్రహ్మానందం
- కథానాయికగా ప్రగ్యా జైస్వాల్
ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టు ఇంతకుముందే చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ఈ సినిమా టీమ్ ప్రకటించింది. గతంలో విష్ణు - నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సక్సెస్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. అమెరికాలోనే ఎక్కువభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో, ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.