'యమలీల' క్లైమాక్స్ లో నేను లేకపోవడంతో ఏడ్చేశాను: ఇంద్రజ
- 'యమలీల'లో నా పాత్ర అసంపూర్తిగా అనిపించింది
- అందుకే చాలా బాధనిపించింది
- సినిమా చూశాక ఏడ్చేశాను కూడా
"ఈ సినిమాలో మీ అమ్మని మీరు ఇంట్లో నుంచి పంపించేయండి అంటూ నేను భర్తతో గొడవపడతాను. దాంతో నా భర్త నాపై చేయి చేసుకుంటాడు .. తన తల్లితోనే ఉంటానని చెప్పి నన్నే వెళ్లిపొమ్మంటాడు. అమ్మ విలువేంటో తెలియాలంటే నీకు బిడ్డ పుట్టాక ఆ బిడ్డనడుగు అంటాడు. ఆ సీన్ తరువాత నేను ఎక్కడా కనిపించను. నా పాత్ర మనసు మార్చుకుని మళ్లీ తిరిగి వచ్చేసినట్టుగా చూపిస్తే బాగుండేది. ఆ పాత్రకి సరైన ముగింపు లేకుండా వదిలేయడం చాలా బాధ కలిగించింది" అని అన్నారు.