ఫ్యాన్సీ నెంబరుపై మోజుతో లక్షలు వెచ్చించిన మలయాళ హీరో...!
- KL 07 CN 1 నెంబరును ఏడు లక్షలకు దక్కించుకున్న మలయాళ హీరో
- ఎర్నాకుళం ఆర్టీఓలో పదివేల రూపాయలతో మొదలైన వేలంపాట
- కారు ధర సుమారు రూ.3.25 కోట్లు..!
ఈ లంబోర్గిని కారు ధర సుమారు రూ.3.25 కోట్లు. 2010లో విడుదలయిన 'విలన్' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ భర్తగా అతను నటించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీఓలు వేలంపాటల్లో ఫ్యాన్సీ నెంబర్లను విక్రయించడం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. మరికొందరు సినిమా స్టార్లు తమకున్న కార్లన్నింటిపైనా ఒకే నెంబరును వాడుతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తనకున్న అన్ని కార్లపై 4545 నెంబరు ప్లేటును వాడుతున్నాడు. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కార్లపై 2727 నెంబరును ఉపయోగిస్తుండటం ఫ్యాన్సీ నెంబర్లపై వారికున్న మోజును తెలియజేస్తుంది.