ధనుష్ మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేసింది!
- ధనుష్ హీరోగా 'వడ చెన్నై'
- దర్శకుడిగా వెట్రి మారన్
- రౌడీయిజం నేపథ్యంగా సాగే కథ
రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే చెన్నై ఉత్తర ప్రాంతంలోని ఒక ప్రదేశం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో ధనుష్ రౌడీ పాత్రలో కనిపించనున్నాడు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. చేతులకు బేడీలతో పోలీస్ వ్యాన్ దిగుతూ ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసినట్టుగా సమాచారం.