ఇది నీ కెరియర్ .. నీ ఇష్టం అని నాన్న అన్నారు: అల్లరి నరేశ్
- నా సినిమాల కథల ఎంపికలో నిర్ణయం నాదే
- మా నాన్న జోక్యం చేసుకునేవారు కాదు
- 40కి పైగా సినిమాలు వేరే దర్శకులతో చేశాను
"కథల ఎంపికను మా ఫాదర్ ఎప్పుడూ నాకే వదిలేసేవారు. నువ్ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకి వెళుతున్నావ్ ... సినిమా ఎలా ఉండాలనేది నీకు తెలుసు. అందువలన నీ కెరియర్ .. నీ ఇష్టం .. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో' అని ఆయన చెప్పేవారు. 'గమ్యం' చూసి వచ్చిన తరువాత ఆయన నాతో ఒక మాట అన్నారు. 'కథగా నాకు చెప్పి వుంటే ఈ సినిమా చేయవద్దని చెప్పేవాడిని. సినిమా అలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు .. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ .. నటన పరంగా అదరగొట్టేశావ్' అన్నారు" అంటూ నరేశ్ చెప్పుకొచ్చాడు.