' నాపేరు సూర్య'లో ఆ ఫైట్ హైలైట్ గా నిలుస్తుందట!
- దేశభక్తి నేపథ్యంలో 'నా పేరు సూర్య'
- భారీ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
- మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు
భారీ స్థాయిలో ఒక సొరంగ మార్గం సెట్ వేసి .. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారని సమాచారం. అల్లు అర్జున్ ఇంతవరకూ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి ఇది పూర్తి భిన్నంగా కనిపిస్తుందని అంటున్నారు. ఉత్కంఠను రేకెత్తించే ఈ ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా, బన్నీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.