అవసరాలతో సినిమాకి ఓకే చెప్పేసిన నాని
- నాని .. అవసరాల మంచి స్నేహితులు
- నానితో సినిమా చేయాలనుకున్న అవసరాల
- తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నాని
నానితో సినిమా చేసే సమయం కోసం అవసరాల చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా నాని ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని ఒక మల్టీస్టారర్ చేయనున్నాడు. ఆ తరువాత ఆయన హను రాఘవపూడితో ఒక సినిమా చేయవలసి వుంది. గతంలోనే ఒక కథ ఓకే అనేసుకుని వున్నారు. ఈ సినిమాతో పాటు అవసరాల సినిమాను చేయడానికి నాని రెడీ అవుతున్నాడని అంటున్నారు.