విద్యాబాలన్ కి క్రేజ్ తెచ్చిపెట్టిన పాత్రలో జ్యోతిక!
- హిందీలో సక్సెస్ ను సాధించిన 'తుమ్హారి సులు'
- తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు
- రాధామోహన్ దర్శకత్వంలో సెట్స్ పైకి
క్రితం ఏడాది 'తుమ్హారి సులు' అనే హిందీ సినిమాలో విద్యాబాలన్ నటించారు. నటన పరంగా ఈ సినిమా విద్యాబాలన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అనేక అవార్డులు ఆమెను పలకరించాయి. ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రాధామోహన్ రంగాన్ని సిద్ధం చేశాడు. హిందీలో విద్యాబాలన్ చేసిన పాత్రను జ్యోతిక చేయనుంది. మధ్యతరగతికి చెందిన మహిళ పాత్రలో జ్యోతిక ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.