రేపే రిలీజ్ కదా .. కంగారుగానే వుంది: నాని
- డబ్బుకోసం తీసిన సినిమా కాదు
- ఇది ఒక భిన్నమైన ప్రయత్నం
- అందరినీ ఆశ్చర్య పరుస్తుంది
"రొటీన్ గా వుండే అంశాలేవీ ఇందులో కనిపించవు. ప్రేక్షకులు సినిమా చూస్తూ.. బయటికి వస్తూ కూడా ఆశ్చర్యానికి లోనవుతూనే వుంటారు. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను డబ్ చేస్తున్నాం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. హీరోగా నా మొదటి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎంతగా కంగారు పడ్డానో, ఇప్పుడు అంతకుమించిన కంగారుగావుంది" అంటూ చెప్పుకొచ్చాడు.