మేం విడిపోయామనే టాక్ ఇప్పటికీ వుంది: శుభలేఖ సుధాకర్ - ఎస్.పి.శైలజ
- ఓ సినిమా పత్రికలో అలా రాశారు
- ఒకావిడ ఫోన్ చేసి ఇలా మాట్లాడింది
- ఇప్పటికీ అనుకుంటూనే వున్నారు
'నేను .. ఆ జర్నలిస్టుతో .. మరో రెండు రోజుల్లో చెన్నై వెళతాను .. అప్పుడు మీరు నాతో పాటు మా ఇంటికి రండి .. అక్కడ శైలజ కనిపిస్తే మీకు నమ్మకం కలుగుతుంది కదా' అన్నాను. అప్పుడు శైలజ అందుకుంటూ .. " ఒకరోజు ఒకావిడ నాకు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేసింది. అన్నయ్య గారు ఎలా వున్నారని అడిగింది. అన్నయ్య అంటే 'బాలు' అనుకుని .. ఆయన ఇక్కడ ఎందుకు వుంటారమ్మా .. వాళ్లింట్లో వుంటారు అన్నాను. అయితే నేను విన్నది నిజమేనా మేడమ్ అనేసింది ఆవిడ. అమ్మా అట్లా కాదు .. మా అన్నయ్య 'బాలు' .. వాళ్లింట్లో వున్నారు .. మా ఆయన శుభలేఖ సుధాకర్ గారు ఇక్కడే వున్నారు .. మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చాను. విచారించవలసిన విషయం ఏమిటంటే .. మేం విడిపోయామనే టాక్ ఇప్పటికీ ఉండటం" అంటూ నవ్వేశారు.