రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోన్న 'సైరా'
- ఈ నెల 23 నుంచి రెండవ షెడ్యూల్
- హైదరాబాద్ లోనే షూటింగ్
- ఆ తరువాతనే కేరళ .. రాజస్థాన్
ఈ నెల 23వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలెట్టనున్నట్టు సమాచారం. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా టీమ్ కేరళ .. రాజస్థాన్ వెళ్లవలసి వుంది. కానీ హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాతనే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఈ సినిమాలో నయనతార చేస్తుందా .. లేదా? అనే విషయంలో ఈ షెడ్యూల్లో క్లారిటీ వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.