'తొలిప్రేమ' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన రాజమౌళి!
- వరుణ్ తేజ్, రాశి ఖన్నా జోడీగా రొమాంటిక్ డ్రామాగా తొలిప్రేమ
- ‘తొలిప్రేమ’ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశా
- దర్శకుడు వెంకీ తన తొలి సినిమాని బాగానే హ్యాండిల్ చేశాడు
- వరుణ్ తేజ్ తన నటనా సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతున్నాడు- రాజమౌళి
దర్శకుడు వెంకీ తన తొలి సినిమాని బాగానే హ్యాండిల్ చేశారని రాజమౌళి ప్రశంసించారు. హీరో వరుణ్ తేజ్ తన నటనా సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతున్నాడని, రాశీఖన్నా బ్యూటిఫుల్ గా కనిపించడంతో పాటు బాగా నటించిందని చెప్పారు. ప్రసాద్, బాపినీడుల నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని, వారికి అభినందనలు తెలుపుతున్నానని తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు.