తరుణ్ భాస్కర్ నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడే
- కొత్త నటీనటులతో తరుణ్ భాస్కర్
- పరిశీలనలో ' ఈ నగరానికి ఏమైంది' టైటిల్
- ఏప్రిల్ రెండవ వారంలో విడుదల
చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగును తరుణ్ భాస్కర్ పూర్తిచేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాయకా నాయికల జర్నీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం 'ఈ నగరానికి ఏమైంది?' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాకి సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్, ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.