నిఖిల్ కి జోడీగా కేథరిన్ కి ఛాన్స్
- 'కణితన్' రీమేక్ లో నిఖిల్
- తెలుగులోను తమిళ దర్శకుడికే ఛాన్స్
- ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం
తమిళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ .. తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక 'కణితన్' లో నటించిన కేథరిన్ కి అదే పాత్ర తెలుగులోను లభించింది. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమా, జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లవలసి వుంది గానీ, కొన్ని కారణాల వలన ప్రారంభం కాలేదు. ఈ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు. తెలుగులోను ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి మరి.