ఓ నిర్మాత డబుల్ గేమ్ ఆడాడు.. అందుకే నిర్మాతగా మారాను!: నాగశౌర్య
- ఆ నిర్మాత మా ఇద్దరి వద్ద రెండు రకాలుగా చెప్పాడు
- అందుకే సొంత బ్యానర్ ఆలోచన చేశాం
- ఈ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ
" ఈ కథ తీసుకుని దర్శకుడు వెంకీ కుడుముల ఓ నిర్మాత దగ్గరికి వెళితే, 'నాగశౌర్యతో ఎందుకూ .. వేరే హీరోతో చేద్దాం' అన్నాడు. "ఆ తరువాత అదే కథను తీసుకుని నేను అదే నిర్మాత దగ్గరికి వెళ్లాను. 'దర్శకుడిగా వెంకీ కుడుముల వద్దు మార్చేద్దాం .. అని ఆ నిర్మాత అన్నాడు. దాంతో "ఎందుకు సార్ .. మాతో డబుల్ గేమ్ ఆడతారు?" అని ముఖం మీదే చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా నాగశౌర్య చెప్పాడు. ఆ సంఘటన తరువాతనే ఈ సినిమాను సొంత బ్యానర్లో చేయాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన అన్నాడు. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అనీ .. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.