'మనసుకు నచ్చింది' రిలీజ్ డేట్ ఖరారు
- సందీప్ కిషన్ హీరోగా 'మనసుకు నచ్చింది'
- కథానాయికగా అమైరా దస్తూర్
- వచ్చేనెల 16వ తేదీన విడుదల
ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందువలన సినిమా కూడా యూత్ మనసులకు దగ్గరగా వెళుతుందని మంజుల భావిస్తున్నారు. నటిగా .. నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మంజుల, దర్శకురాలిగా ప్రేక్షకుల మనసులను ఏ స్థాయిలో గెలుచుకుంటుందో చూడాలి. ఇక ఇదే రోజున నాని 'అ!' సినిమా కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.