ఎన్ని రోజులని చీరే కట్టుకోవాలి?: ప్రగ్యా జైస్వాల్
- 'కంచె'లో చీరతో మెరిసిన ప్రగ్యా
- ఆ క్యారెక్టరే అడ్డంకిగా మారిందంట
- షార్ట్ డ్రస్ వేసుకుంటే అభిమానుల నుంచి కామెంట్లు
- రోజూ చీరలేనా అంటున్న అందాల ముద్దుగుమ్మ
మీరు రాకుమారిగా, చీరకట్టులో ఉంటేనే బాగుంటారని చాలా మంది వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రగ్యా సైతం స్పందించింది. "కంచె సినిమాతో సీత ఓవర్. ప్రతి రోజూ నేను చీరలు కట్టుకోలేను కదా? ఇప్పుడు మరోలా కనిపించాలన్నది నా ఆలోచన" అని స్పష్టం చేసింది. ఓ క్యారెక్టర్ చేసి, ఆ సినిమా హిట్ అయితే, ఆ ఇమేజ్ నుంచి బయటపడటం చాలా కష్టమని అంగీకరించిన ప్రగ్యా, తనకు అన్ని రకాల రోల్స్ చేయడమూ ఇష్టమేనని, గ్లామర్ గా కనిపించడానికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చింది. పొట్టి డ్రస్ అయినా, జీన్స్ అయినా, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎలాంటి డ్రస్ వేసుకోవడానికైనా సిద్ధమేనని అంది. ఈ దిశగా బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.