'జై జనసేన' అంటూ బాబాయ్ కి శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్!
- తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదన్న పవన్
- కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్
- ఫేస్ బుక్ పోస్ట్ పెట్టిన రామ్ చరణ్
ఫేస్ బుక్ వేదికగా ఆయన తన సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమిని రక్షించుకొనే బాధ్యత నాపై ఉంది.. అంటూ ఎనర్జిటిక్ కామెంట్ తో పవన్ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నా.. బాబాయ్ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నా. జై జనసేన’’ అని పవన్ ఫోటో పెట్టి పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.