బాలీవుడ్లో మరో ఛాన్స్ కొట్టేసిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్
- సోనమ్ కపూర్‌తో నటించనున్న దక్షిణాది నటుడు
- అనుజా చౌహాన్ 'ద జోయా ఫ్యాక్టర్' నవల ఆధారంగా చిత్రం
- దుల్కర్‌కి ఇది రెండో బాలీవుడ్ సినిమా
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 'మన్మర్జియాన్' చిత్రంలో మొదట హీరోగా దుల్కర్ సల్మాన్‌ని అనుకున్నారు. కానీ ఆ స్థానంలో అభిషేక్ బచ్చన్‌ని తీసుకున్నారు. ఇక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తెలుగు చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ నటిస్తున్నాడు. మలయాళంలో ఇటీవల విడుదలైన దుల్కర్ చిత్రం 'సోలో' ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు.