'జై సింహా' మూడు రోజుల వసూళ్లు!
- మొదటి నుంచి బాలకృష్ణకి మాస్ ఇమేజ్
- ఆయన సినిమాలో మాస్ అంశాలు పుష్కలం
- అందుకే పెరుగుతోన్న వసూళ్లు
ఈ సినిమాకంటే రెండు రోజులు ముందుగా వచ్చిన 'అజ్ఞాతవాసి' అభిమానులను నిరాశపరిచింది. 'జై సింహా'తో పాటే విడుదలైన 'గ్యాంగ్' కూడా ఆకట్టుకోలేకపోయింది. 'జై సింహా' తరువాత వచ్చిన 'రంగుల రాట్నం' కూడా ఆశించిన స్థాయిలో యూత్ ను అలరించలేకపోయింది. బాలకృష్ణ సినిమాలో మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు పుష్కలంగా ఉండటంతో, ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందని చెప్పుకుంటున్నారు.