ప్రేమలో పడటం వల్లనే కొన్ని ఛాన్సులు చేజారాయి: రెజీనా
- నటిని కావాలనేది నా కోరిక
- అనుకున్నది నెరవేరింది
- కానీ లవ్ లో పడటంతో గ్రాఫ్ తగ్గింది
- ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయను
"నటిని కావాలనేది నా కోరిక .. అందుకే నేను ఈ రూట్లోకి వచ్చాను. పదేళ్ల కెరియర్లో ఎన్నో మలుపులు చూశాను. ప్రేమలో పడటం వంటి పొరపాట్లు కూడా చేశాను. పొరపాటు చేస్తున్నాను అని తెలుసుకునేలోగా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. ఫలితంగా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాను. ఇక ఇప్పుడు నా దృష్టంతా కెరియర్ పైనే. మంచి అవకాశాలను దక్కించుకుంటూ .. సక్సెస్ లను సొంతం చేసుకుంటూ నేనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పింది.