కౌన్సెలింగ్ లో బాగా చెప్పారు.. మరోసారి ఈ తప్పు చేయను!: యాంకర్ ప్రదీప్
- మద్యం తాగి కారు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన యాంకర్
- నేను చేసిన తప్పుని ఎవ్వరూ చేయకూడదు
- తాగినప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చోవద్దని పోలీసులు అన్నారు
- తాగి నడపడం వల్ల యాక్సిండెట్లు జరుగుతోన్న తీరును పోలీసులు వివరించారు
తాగినప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చోవద్దని అన్నారని ప్రదీప్ చెప్పాడు. తాను మరోసారి ఈ తప్పు చేయబోనని అన్నాడు. బాధ్యతగల వ్యక్తిగా తాను పోలీసుల విచారణకు సహకరించానని అన్నాడు. తాను షూటింగుల్లో బిజీగా ఉన్న కారణంగానే తాను లేటుగా వచ్చానని, అంతే తప్ప తానేం పారిపోలేదని చెప్పుకొచ్చాడు. సాధారణ మనిషి ఎలాగైతే కౌన్సెలింగ్కు హాజరవుతాడో తాను కూడా అలాగే హాజరయ్యానని అన్నాడు. తాను చేసిన తప్పుని ఎవ్వరూ చేయకూడదని హితవు పలికాడు.