నిఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా కేథరిన్
- 'కిరిక్ పార్టీ' రీమేక్ చేస్తోన్న నిఖిల్
- తదుపరి చిత్రంగా 'కణిథన్' రీమేక్
- ఈ నెల 19వ తేదీన సెట్స్ పైకి
తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమా రీమేక్ ను ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. ప్రస్తుతం కేథరిన్ తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు తన కెరియర్ కు చాలా హెల్ప్ చేస్తాయని ఆమె భావిస్తోంది.