చలికాలంలో మంచు కొండల్లో రేణూ దేశాయ్... ఫొటో చూసి 'సూపర్ వదినా' అంటున్న పవన్ ఫ్యాన్స్!
- కాశ్మీర్ లో గడ్డకట్టించే చలిలో రేణూదేశాయ్
- ఉల్లాసంగా గడుపుతున్న నటి
- 'ఖావా' తాగుతూ ఎంజాయ్
- ఫేస్ బుక్ లో ఫొటోలు పెట్టిన రేణు
కాశ్మీరీ గ్రీన్ తేయాకు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు వంటి వాటిని కలుపుతూ, 'సమోవర్' అనే సంప్రదాయ ఫిల్టర్ లో తయారు చేసే 'ఖావా' ఎంతో రుచిగా ఉందని చెప్పింది. ఇందులో కలిపే పదార్థాలను బట్టి రుచి, సువాసన మారతాయని తెలిపింది. ఇక్కడ చాలా చలిగా ఉందని, ఆ చలిని కూడా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొంది. ఇక రేణూ దేశాయ్ పెట్టిన పోస్టుకు 'సూపర్ వదినా' అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి.