అప్పట్లో నేను ఎత్తుకున్న చిన్నారి పాపే ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్: సునీల్
- ఈ నెల 29న '2 కంట్రీస్'
- కథానాయికగా మనీషా రాజ్
- ఆమె ఎంపిక అలా జరిగింది
"మొదటి రోజు షూటింగ్ పూర్తయిన తరువాత "చాలా కాలం క్రితం మీరు మా పాపను ఎత్తుకున్నారు .. అప్పుడు మీతో మేం ఫోటో దిగాము" అని హీరోయిన్ తండ్రి అనడంతో ఆశ్చర్యపోయాను. 'సొంతం' సినిమా కోసం అప్పట్లో నేను ఫారిన్ వెళ్లాను. అప్పుడు ఓ యంగ్ కపుల్ తమ పాపను తీసుకొచ్చి నాతో ఫోటో దిగారు. ఆ అమ్మాయే ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్ అని తెలుసుకుని షాక్ అయ్యాను' అంటూ సునీల్ నవ్వాడు.