విద్యార్థినిలో ప్రేరణ కల్పించేందుకు అనూహ్య నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్!
- కలెక్టర్ కావాలనుకుంటున్నానన్న విద్యార్థినిని తన కారులో కూర్చోబెట్టిన కలెక్టర్
- కారు వెలుపల నిలబడి ఫొటో
- ఈ ఫొటో ద్వారా స్ఫూర్తిని పొందాలంటూ ఆశీర్వాదం
గ్రామీణ ప్రాంతానికి చెందిన మనీషా ఎంతో ధైర్యంగా చెప్పిన సమాధానంతో కందసామి పులకించిపోయారు. బహుమతుల ప్రదానం అనంతరం ఆ చిన్నారిని ఆయన స్వయంగా తన కారులోని తన సీటులో కూర్చోబెట్టి, ఆయన వాహనం బయట నిలబడి ఫొటో దిగారు. అనంతరం ఒక ఫొటో కాపీని ఆమెకు ఇచ్చారు. 'నీవు నీ జీవిత లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ ఫొటో నుంచి స్ఫూర్తిని పొందాలి' అంటూ ఆశీర్వదించారు. మనీషా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలతో 11వ తరగతి చదువుతోంది. అనంతరం మనీషా మాట్లాడుతూ, కలెక్టర్ కారులో కూర్చోవడం తనకు భావోద్వేగాన్ని కలిగించిందని... ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. మరోవైపు, కలెక్టర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.