సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దంటోన్న బాలకృష్ణ.. 'జై సింహా' టీజర్ విడుదల!
- బాలయ్య ఫైట్స్, డైలాగ్స్ అదుర్స్
- కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో జై సింహా
- ఈ నెల 24వ తేదీన 'జై సింహా' ఆడియో లాంచ్
ఈ సినిమాలో నయనతార, నటాషా దోషీ, హరిప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన 'జై సింహా' ఆడియో లాంచ్ వేడుకను విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, జై సింహా వచ్చేనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.