రవితేజ జోడీగా ఆసక్తి చూపని రకుల్ .. తమన్నాకు ఛాన్స్!
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం
- హీరోయిన్ విషయంలో మారిన నిర్ణయం
ఇక ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకుకోవాలని మొదట్లో దర్శకుడు భావించాడు. అయితే, ఆమెను సంప్రదించగా .. ఆమె పెద్దగా ఆసక్తిని చూపలేదట. గతంలో రవితేజతో చేసిన 'కిక్ 2' సక్సెస్ కాకపోవడం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రకుల్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో, రవితేజ జోడీగా తమన్నాను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బెంగాల్ టైగర్' వచ్చిన సంగతి తెలిసిందే.