ఫస్టు టైమ్ సుహాసినికి డబ్బింగ్ చెప్పాను .. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది: రోజా రమణి
- ఒరియా సినిమాలు చేయడంతో చక్రపాణితో పరిచయం
- పెద్దల అంగీకారంతో పెళ్లి
- బాబు పుట్టిన కొంత కాలానికి డబ్బింగ్ వైపుకు
- డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు
"బాబుకు రెండున్నర సంవత్సరాలు వచ్చేవరకూ సినిమాలపై దృష్టి పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లోనే సుహాసినికి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాను. ఆ తరువాత సుహాసిని బాగా పాప్యులర్ అయిపోయింది. దాంతో వరుసగా ఆమెకి ఓ 15 .. 20 సినిమాలకి డబ్బింగ్ చెబుతూ వచ్చాను. ఆ తరువాత ఇతర భాషలకి చెందిన కథానాయికల రాక పెరిగింది. దాంతో వాళ్లకి కూడా డబ్బింగ్ చెప్పవలసి రావడంతో బాగా బిజీ అయ్యాను. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.