నాకు కూడా గతంలో ఇటువంటి సమస్యే వచ్చింది: 'పద్మావతి' సినిమాపై ఉపేంద్ర స్పందన
- ‘హెచ్2ఓ’ సినిమా తీసినప్పుడు ఇటువంటి సమస్య ఎదుర్కున్నా
- ఆందోళన చేస్తున్నవారు దర్శకుడు భన్సాలీతో మాట్లాడాలి
- దేన్నైనా ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి
ఈ సినిమాపై ఆందోళన చేస్తున్నవారు దర్శకుడు భన్సాలీతో మాట్లాడాలని ఉపేంద్ర సూచించారు. గతంలో తాను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నానని అన్నారు. తాను ‘హెచ్2ఓ’ అనే సినిమా తీసినప్పుడు తనకు ఇటువంటి సమస్యలు ఎదురయ్యాయని, సామాజిక, చారిత్రక అంశాలపై సినిమాలు తీస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.