ఆ సినిమా నుంచి వైదొలగే హక్కు నాకు ఉంది: త్రిష
- 'సామి 2' సినిమాలో విక్రమ్ కు జంటగా త్రిష, కీర్తి సురేష్
- సినిమా నుంచి వైదొలగిన త్రిష
- తనకు ప్రాధాన్యత లేదని ఆరోపణ
ఈ వ్యవహారంపై త్రిష స్పందించింది. సినిమాలో కీర్తి సురేష్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉందని... ఆమె కంటే తనకు తక్కువ సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. తాను ఇంతవరకు 'సామి 2' సినిమాలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని... అందువల్ల సినిమా నుంచి వైదొలగే హక్కు తనకు ఉందని చెప్పింది. తాను తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేస్తానని తెలిపింది. మరోవైపు, ఈ సినిమాలో ఆమెను నటింపజేసేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయట.