బిగ్ డిబేట్: క్వింటోస్, చెర్రీ బ్లెయిర్, ఇవాంకా ట్రంప్, చంద కొచ్చర్... మధ్యలో కేటీఆర్!
- రెండో రోజు జీఈఎస్-2017 చర్చలు ప్రారంభం
- 'ఉయ్ కెన్ డూ ఇట్' అంటున్న ఔత్సాహిక మహిళలు
- తొలి సెషన్ సంధానకర్తగా కేటీఆర్
'వీ కెన్ డూ ఇట్' థీమ్ తో చర్చ సాగింది. తెలంగాణలో ప్రైవేటు రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, మహిళలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూనే, కేటీఆర్ మిగతా వారితో పలు అంశాలపై చర్చించారు. మహిళా సాధికారత, వ్యవసాయం పెట్టుబడులు, వ్యాపార మెళకువలు, ఆరోగ్యం, క్రీడలు, మీడియా, వినోదం వంటి రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.
మహిళల గురించి తనకు ఎంతో చెప్పాలని ఉందని, అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు మరింతగా ప్రోత్సాహం కల్పించాల్సి వుందని, అందుకు అమెరికా ప్రభుత్వం ఎంతో చేస్తోందని ఇవాంకా వ్యాఖ్యానించారు. వంటగది నుంచి మహిళలు బయటకు రావడం చాలా దేశాల్లో మొదలైందని, ఈ విషయంలో ఇండియా, అమెరికాలు ముందున్నాయని అన్నారు. ఇండియాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, కుటీర పరిశ్రమల స్థాయి నుంచి వారిని మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాయికి నడిపించాల్సి వుందని చందకొచ్చర్ పేర్కొన్నారు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తే మహిళలు మరింతగా రాణించగలరని చెర్రీ బ్లెయిర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.