అందుకే టైటానిక్ లో హీరో చనిపోయాడు: దర్శకుడు జేమ్స్ కేమరాన్
- 1997లో విడుదలై ఘన విజయం సాధించిన టైటానిక్
- 11 ఆస్కార్ అవార్డులు
- క్లైమాక్స్ లో హీరో చనిపోవడంపై కెమెరాన్ వివరణ
‘అతడు (హీరో) బతికి ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ కు అర్థం ఉండేది కాదని అన్నారు. అసలు ఈ సినిమా నేపథ్యమే చావు, విడిపోవడం అనే అంశాలతో ముడిపడి ఉందని తెలిపారు. కథానుసారంగా అతను చనిపోవాల్సిందేనని అన్నారు. అది ఒక కళాత్మక నిర్ణయమని ఆయన తెలిపారు. అందుకే ఈ కథలో చివరి వరకు ఆమె పాత్రను ఉంచగలిగినా, అతడ్ని ఉంచడం సాధ్యం కాలేదని ఆయన చెప్పారు.
అలా జరిగింది కాబట్టే 20 ఏళ్ల తరువాత కూడా ఆ కథ గురించి మాట్లాడుకుంటున్నామని ఆయన అన్నారు. అయితే ఇలా ఒక సినిమా గురించి 20 ఏళ్ల తరువాత ఇప్పుడు మాట్లాడుకోవడం సరదాగా ఉందని ఆయన అన్నారు. ఈ కథలో హీరో పాత్రను చక్కగా తెరకెక్కించామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంత బాగా తెరకెక్కించాము కాబట్టే క్లైమాక్స్ లో అతను చనిపోయినప్పుడు ప్రేక్షకులు చాలా ఫీలయ్యారని ఆయన తెలిపారు.