చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోన్న 'జై సింహా'
- ఈ నెల 22 నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణ
- డిసెంబర్ 1వతేదీతో షూటింగు పార్టు పూర్తి
- అదే నెల 23న ఆడియో రిలీజ్
- సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్
ఆ రోజు నుంచి డిసెంబర్ 1వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తికానుంది. హైదరాబాద్ లో జరిగే ఈ షూటింగులో ప్రధాన పాత్రధారులంతా పాల్గొననున్నారు. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన ఆడియోను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయనున్నారు. నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.