"చిన్నప్పుడు నీకన్ని చిరంజీవి సినిమాలు చూపించా... నాకు ఆయన్ని చూపించవా?"... అని నాన్న అడిగితే బాధేసిందన్న దర్శకుడు బాబీ!
- చిరంజీవి సినిమా వస్తే చెక్కేసేవాళ్లం
- ఆయన్ని చూపించాలని కోరారు
- విషయం చిరంజీవికి తెలిసి స్వయంగా మా ఇంటికే వచ్చారు
- తన తండ్రికిచ్చిన అతిపెద్ద బహుమతి ఇదేనన్న బాబీ
కొద్ది రోజుల క్రితం నాన్న ఆరోగ్యం పాడైంది. ఆ సమయంలో నన్ను పిలిపించి, "ఏరా, చిన్నప్పుడు నీకన్ని చిరంజీవి సినిమాలు చూపించా. నాకు ఆయన్ని చూపించవా?" అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా బాధేసింది. వెంటనే దర్శకుడు వినాయక్ కు ఫోన్ చేసి విషయం చెబితే, అరగంటలో చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి, తానే మా ఇంటికి వస్తానని చెప్పారని అన్నాడు. ఆయన వస్తే, ఆ సంతోషంలో నాన్నకేమైనా అవుతుందని భయపడి, తామే వస్తామని చెప్పినా చిరంజీవి వినలేదని, 'జై లవకుశ' విడుదల రోజు ఆయన తన ఇంటికి వచ్చి రెండు గంటలు గడిపారని బాబీ వెల్లడించాడు. తన తండ్రికి తానిచ్చిన అతిపెద్ద బహుమతి ఇదేనని అన్నాడు.