ఆ సీన్ చేసిన తరువాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన నాకు సారీ చెప్పారు!: గౌతమి
- 'ద్రోహి' సినిమాలో ఆ సీన్ ను మర్చిపోలేం
- ఆ క్రెడిట్ శుభలేఖ సుధాకర్ కి వెళుతుంది
- డైరెక్టర్ కట్ చెప్పాక .. ఆయన చాలా బాధపడ్డారు
ఆ సీన్ గురించి గౌతమి మాట్లాడుతూ .." ఆ సీన్లో ఇద్దరిలో ఏ ఒక్కరో బాగా చేస్తే అది పండదు .. ఇద్దరం సమానంగా చేయడం వల్లనే ఆ సీన్ ఎక్కడికో వెళ్లింది. శుభలేఖ సుధాకర్ వలన నేను బాగా చేయగలిగాను .. నా రియాక్షన్ వలన ఆయన అద్భుతంగా చేశారు. నిజం చెప్పాలంటే ఈ సీన్ కి సంబంధించిన క్రెడిట్ ఆయనకే వెళుతుంది. ఆ పాత్రలో ఆయన కళ్లలో ఈవెల్ నెస్ .. వెర్రితనం చూసి షాక్ అయ్యాను. డైరెక్టర్ కట్ చెప్పగానే "ఐయామ్ సో సారీ అమ్మా .. ఐయామ్ సో సారీ అమ్మా .." అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఫరవాలేదండీ అని నేను చెబుతున్నా ఆయన వినిపించుకోలేదు" అంటూ ఆనాటి సంఘటనను వివరించారు.