'ఆచారి అమెరికా యాత్ర' ఫస్టులుక్ వచ్చేస్తోంది
- హైదరాబాదుతో పాటు మలేసియా, అమెరికాలలో షూటింగ్
- కొనసాగుతోన్న చివరి షెడ్యూల్ షూటింగ్
- ఈ నెల 23వ తేదీన మంచు విష్ణు పుట్టినరోజు
- ఆ రోజున రిలీజ్ కానున్న ఫస్టులుక్
ఈ నెల 23వ తేదీన మంచు విష్ణు పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజున ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. సాధ్యమైనంత త్వరలోనే టీజర్ ను కూడా వదలాలనే ఆలోచనలో వున్నారు. గతంలో నాగేశ్వర రెడ్డి - మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన 'దేనికైనా రెడీ' .. 'ఈడో రకం ఆడో రకం' ఘన విజయాన్ని సాధించాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే వున్నాయి.