ఫొటోగ్రాఫర్లే లైంగికంగా వేధించారు: అంతర్జాతీయ మోడల్ సంచలన ప్రకటన
- మోడలింగ్ రంగంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయన్న అంతర్జాతీయ మోడల్
- తనకూ ఎదురయ్యాయన్న ప్రముఖ మోడల్ డ్రూ క్యాథరిన్
- ఫొటోగ్రాఫర్లే లైంగిక వేధింపులకు పాల్పడతారన్న డ్రూ క్యాథరీన్
ఒంటారియో ప్రముఖ మోడల్, అందాల సుందరి డ్రూ క్యాథరిన్ తన కెరీర్ లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి పెదవి విప్పింది. తాను మోడలింగ్ చేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు తనను లైంగికంగా వేధించారని ఆమె తెలిపింది. కేవలం తననే కాదని, చాలా మంది మోడల్స్ లైంగిక వేధింపులబారిన పడ్డారని ఆమె వెల్లడించింది. ఫొటోషూట్ లకు వెళ్లినప్పుడు ఈ వేధింపులు ఎదురవుతాయని ఆమె తెలిపింది. ఈమేరకు ఆమె ఇన్ స్టా గ్రాంలో తన లేటెస్ట్ ఫొటోలను ఆమె పోస్టు చేసింది.