విడుదల తేదీని ఖరారు చేసుకున్న 'గృహం'
- సిద్ధార్థ్ హీరోగా .. నిర్మాతగా రూపొందిన 'గృహం'
- హారర్ థ్రిల్లర్ నేపథ్యం
- ఆండ్రియా కథానాయిక
- ఇక్కడ హిట్ కోసం సిద్ధార్థ్ వెయిటింగ్
తమిళంలో 'అవళ్' పేరుతో విడుదలైన ఈ సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బెస్ట్ హారర్ ఫిలిమ్స్ లో ఈ సినిమా కూడా ఒకటి' అంటూ అక్కడ రివ్యూలు వచ్చాయి. అలాంటి ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన తెలుగులో 'గృహం' పేరుతోను .. హిందీలో 'ది హౌస్ నెక్స్ట్ డోర్' పేరుతోను విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు. ఇక ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి మరి.