ఇలా చేస్తే ఎలా అంటూ '2.0' టీమ్ పై ఇతర నిర్మాతల అసహనం!
- శంకర్ తాజా చిత్రంగా '2.0'
- ప్రధాన పాత్రధారులుగా రజనీ, అక్షయ్
- విడుదల తేదీపై అయోమయం
- క్లారిటీ ఇవ్వని దర్శక నిర్మాతలు
అభిమానులంతా ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ను బట్టి తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకోవాలనుకున్న నిర్మాతలు, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తమని అయోమయానికి గురిచేయకుండా అసలు తేదీని ఎనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారనేది కోలీవుడ్ టాక్.