'బాలకృష్ణుడు' విడుదల తేదీని ఖరారు చేసేశారు!
- 'బాలకృష్ణుడు'గా నారా రోహిత్
- దర్శకుడిగా పవన్ మల్లెల
- కథానాయికగా రెజీనా
- ఫ్యాక్షన్ ప్రేమకథ నేపథ్యం
పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించింది. హైదరాబాద్ - కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ ప్రేమకథగా ఈ సినిమా కొనసాగుతుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు కంటే ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా నారా రోహిత్ కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమా సక్సెస్ పై ఇటు నారా రోహిత్ .. అటు రెజీనా ఇద్దరూ కూడా ఆశలు పెట్టుకున్నారు.