సిద్ధార్థ్ సొంత బ్యానర్ పేరు వెనుక పెద్దకథే ఉందండోయ్!
- సిద్ధార్థ్ హీరోగా రూపొందిన 'గృహం'
- సొంత నిర్మాణంలో చేసిన సినిమా
- ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ నేపథ్యంలో ఆయన బ్యానర్ పేరు 'ఎటాకి'పై అందరిలో ఆసక్తి పెరిగింది. 'ఎటాకి' అంటే బెంగాలీ భాషలో 'అదేంటి' అనే అర్థం వస్తుందని సిద్ధార్థ్ చెప్పాడు. " ఏడేళ్ల వయసులో నేను ఓ యాడ్ ఫిల్మ్ లో నటించాను .. అప్పుడు 'అదేంటి' అనే అర్థం వచ్చే మాటను ఏడెనిమిది భాషల్లో పలకాల్సి వచ్చింది. ఎందుకో తెలియదు గానీ, బెంగాలీ భాషలోని 'ఎటాకి' అనే పదం నన్ను బాగా ఆకర్షించింది. పెద్దయిన తరువాత ఏదైనా కంపెనీ పెడితే ఆ కంపెనీకి 'ఎటాకి' అనే పేరు పెడతానని మా అమ్మతో చెప్పాను .. ఆ తరువాత అదే చేశాను" అంటూ తన సొంత బ్యానర్ పేరు వెనుక గల అసలు కథను చెప్పుకొచ్చాడు.