అలాంటివాళ్లు ఇండస్ట్రీలో కొంతకాలమే వుంటారు : బ్రహ్మాజీ
- సక్సెస్ అనేది టీమ్ వర్క్
- నేనే గొప్ప అనుకున్నవాళ్లు చాలామంది వెళ్లిపోయారు
- గుర్తుపట్టేసి జనం వచ్చి మీద పడిపోతారనుకోవడం భ్రమ
- కామన్ మేన్ గా ఉండటమే నాకు ఇష్టం
"సినిమాల్లో వేషాలు ఎప్పటికీ వుంటాయని అనుకోవద్దు .. నేను గొప్ప అనే భ్రమలో వుండకూడదు. నేను సెలబ్రిటీని .. బయటికి వెళితే జనం గుర్తుపట్టేసి మీద పడిపోతారని ఇంట్లోనే బిగుసుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు. రేపటి రోజున సినిమాలు లేకపోతే బయటికి రాలేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. స్టార్ హీరోల విషయంలో జనం మీద పడిపోవడం జరుగుతుందేమోగానీ, మిగతా వాళ్ల విషయంలో అలా జరగదు. మా ఇంట్లోకి కావలసిన కూరగాయలను నేనే కొంటా .. సూపర్ మార్కెట్లకు నేనే వెళతా .. బ్యాంక్ కి నేనే వెళతా. కామన్ మేన్ గా బతకడమే నాకు ఇష్టం" అని స్పష్టం చేశారు.