యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆచారి అమెరికా యాత్ర'
- మంచు విష్ణు తాజా చిత్రంగా 'ఆచారి అమెరికా యాత్ర'
- నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మూడవ సినిమా
- కథానాయికగా ప్రగ్యా జైస్వాల్
- కీలక పాత్రలో బ్రహ్మానందం
టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాను ఎక్కువగా అమెరికాలో చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ రావడంతో యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంచు విష్ణుతో నాగేశ్వర రెడ్డి చేసిన 'దేనికైనా రెడీ' మంచి మార్కులు తెచ్చుకోగా .. 'ఈడో రకం ఆడో రకం' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడవ సినిమా ఇది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బ్రహ్మానందం ఓ కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.