'కర్ణ' కాదట .. బాలయ్య సినిమా కోసం మరో పవర్ఫుల్ టైటిల్
- కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ సినిమా
- నయనతారతో పాటు మరో ఇద్దరు కథానాయికలు
- సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల
ఈ సినిమాకు 'కర్ణ' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి 'కర్ణ' టైటిల్ ను ఫిక్స్ చేయలేదట. 'జయసింహ'ను ఖరారు చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. 'సింహ' అనే టైటిల్ గల బాలకృష్ణ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్ తో ఈ సినిమాకి 'జయసింహ'ను ఫిక్స్ చేయనున్నట్టు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.